పాక్ బరితెగింపు: కాశ్మీర్‌పై భారీగా డ్రోన్లతో దాడి- సైరన్ మోతలు: తీవ్ర ఉద్రిక్తత
Drone attack on Jammu Kashmir: పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి పాకిస్తాన్‌పై ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై బుధవారం తెల్లవారు జామున మిస్సైళ్లతో దాడి చేసింది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ దాడితో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలపై వేళ్లూనుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నామరూపాల్లేకుండా చేసింది భారత్. జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు భారీగా నష్టపోయాయి. అవి నిర్వహిస్తోన్న శిబిరాలను 25 నిమిషాల్లోనే ధ్వంసం చేసి పడేసింది.

ఈ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చనీ తెలిపారు. ఈ నష్టానికి అక్కడితో బ్రేకులు పడలేదు. పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్రంగా నష్టపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ప్రయోగ కేంద్రం హెచ్ క్యూ 9 భారీగా దెబ్బతిన్నది.
చైనా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను అభివృద్ధి చేసుకుంది పాకిస్తాన్. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఇవి. భూ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండేది ఇక్కడే. శతృ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, ఇంటర్‌సెప్ట్ కావడానికి హెచ్ క్యూ 9 మిస్సైల్ టెక్నాలజీని రూపొందించుకుంది.
ఇంత ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ- పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోలేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రత్యేకించి- జమ్మూలో పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకుని రావడం కనిపించింది. డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్ ఆర్మీ.
జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు దూసుకుని రావడం కనిపించింది. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ వైపు దూసుకొచ్చాయి అవి. యుద్ధంలో వినియోగించే స్వార్న్ డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినట్లు భారత సైనిక వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.
డ్రోన్లు భారత్ వైపు దూసుకుని రావడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్ అంతటా సైరన్ మోతలు మోగించింది భారత ఆర్మీ. సాధారణ పౌరులకు ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండకూడదనడానికి సూచికగా సైరన్ మోతలు మోగించింది.
వరుసబెట్టి వస్తోన్న డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. వాటితో ఇంటర్‌సెప్ట్ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేస్తోంది. అదే సమయంలో బ్లాక్ అవుట్‌ను కూడా నిర్వహించింది. చీకటి ఆవరించిన జమ్మూ కాశ్మీర్ గగనతలంపై డ్రోన్లు దూసుకుని వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతకుముందు సరిహద్దు గ్రామాలపై పదే పదే మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగుతూ వచ్చింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోర్టార్ షెల్స్‌తో ప్రతీకారానికి పాల్పడింది పాకిస్తాన్.
#WATCH | Sirens being heard in Akhnoor, Jammu and Kashmir
— ANI (@ANI) May 8, 2025
More details awaited. pic.twitter.com/eiGdyj14Tq
పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్‌కోఠ్, జమ్మూ సెక్టార్ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్ సెక్టార్ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఫిరంగులతో సైతం కాల్పులు జరిపారు ఆ దేశ సైనికులు. ఆ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి.
దీని తరువాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. స్థానికులు బంకర్లకు తరలివెళ్లారు. మరికొందరు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు. తంగ్ధర్‌లో భారీ నష్టం సంభవించింది. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదే.
#WATCH | Sirens being heard in Akhnoor, Jammu and Kashmir
— ANI (@ANI) May 8, 2025
More details awaited. pic.twitter.com/eiGdyj14Tq












Click it and Unblock the Notifications