హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జమున కన్నుమూత, హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచిన అలనాటి నటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జమున కన్నుమూత

అలనాటి అందాల నటి జమున తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 86 ఏళ్ళు.

నటిగా, దర్శకురాలిగా, రాజకీయ నేతగా బహుముఖంగా రాణించిన జమున హైదరాబాద్‌లోని స్వగృహంలో ఈ ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాకు గురైన తర్వాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వార్తలు వచ్చాయి.

జమున భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకురానున్నారు.

పదహారేళ్ళ వయసులో డాక్టర్ గరికపాటి రాజారావు పుట్టిల్లు సినిమాతో జమున తన నట జీవితాన్ని ప్రాంభించారు. ఈ సినిమా 1953లో విడుదలైంది.

తెలుగు సినిమా సత్యభామగా పేరు పొందిన జమున అగ్రనటులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వంటి వారితో కలిసి నటించారు. మిస్సమ్మ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా జమున నటించారు.

మొత్తంగా 198 సినిమాల్లో జమున నటించారు.

1964, 68లలో జమునకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.

2008లో జమునకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది.

1989 నుంచి 1991 మధ్య కాలంలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు ఆమె పార్లమెంట్ సభ్యురాలిగా నిర్వహించారు. అయితే, 1991లో జరిగిన ఎన్నికల్లో జమున ఓడిపోయారు.

1936లో ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున, ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాస రావు, కౌసల్య దేవి.

ఆమె అసల పేరు జనాబాయి. అయితే జన్మనక్షత్రం ప్రకారం ఆమె పేరులో నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో ఆమె పేరుతో 'ము’ అనే అక్షరం చేర్చి జమునాగా మార్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jamuna passed away, the yesteryear actress who breathed her last at her home in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X