Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుల్వామా ఎఫెక్ట్ .. కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ ఈవెంట్ కు వెళ్లొద్దని షబానా దంపతుల నిర్ణయం ..

న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడి నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులతో కలిపి పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ లో జరిగే సాంస్కతిక కార్యక్రమాలకు హాజరుకాబోమని చెబుతూ నటులు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.

Javed Akhtar, Shabana Azmi say no to Karachi Arts Council event

కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ కు నో ..
ప్రముఖ పాటల రచయిత, మాటల రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య షబానా అజ్మీ కరాచీలో జరిగే ఆర్ట్స్ కౌన్సిల్ కార్యక్రమానికి రాబోమని తేల్చిచెప్పారు. పుల్వమాలో ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. షబానా దంపతులకు ఇదివరకే ఆహ్వానం రాగా .. ఉగ్ర దాడి తర్వాత తాము హాజరుకాబోమని స్పష్టంచేశారు.

పిరికిపంద చర్య .. సచిన్
మరోవైపు ఉగ్ర దాడిని మాజీ క్రికెటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఖండించారు. ఈ ఘటన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడి తర్వాత కనిపించిన మాంసపు ముద్దలతో మనసు చలించి పోయిందన్నారు. దాడిలో గాయపడ్డ వారు త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశం కోసం పనిచేస్తున్న సైనికులకు సెల్యూట్ అని ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+