భార్యను ఏడుసార్లు కసితీరా కాల్చిన జవాను.. ఆపై తనూ ఆత్మహత్య..
అతనో జవాను.. ఆర్నెళ్ల క్రితమే వివాహమైంది. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తన భార్యను ఆ జవాను హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శరీరంలో మొత్తం ఏడు బుల్లెట్లు దింపాడు. అంత కసిగా,నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎందుకు హతమార్చాడో తెలియరాలేదు. బీహార్‌లని సీతామర్హి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కి చెందిన చంద్రభూషణ్‌కు మధు అనే యువతితో ఆర్నెళ్ల క్రితం పెళ్లి జరిగింది. చంద్రభూషణ్ త్వరిత ప్రతిస్పందన బృందం (QRT)లో జవానుగా సీతామర్హిలో విధులు నిర్వరిస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే ఓ అద్దె ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఏమైందో తెలియదు ఆదివారం ఒక్కసారిగా అతని ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో చుట్టుపక్కలవారు ఇంటి తలుపు తట్టగా ఎటువంటి స్పందనా రాలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఇంట్లో ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. భార్య మధును గన్‌తో కాల్చి,ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు శరీరంలో మొత్తం ఏడు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications