జయకి షాక్: అక్రమాస్తుల కేసులో సుప్రీం నోటీసు,కానీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితం ఆమెకు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా తేల్చింది.
దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జయలలితకు నోటీసులు జారీ చేసింది. జయతో పాటు మరో ముగ్గురికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
అదే సమయంలో హైకోర్టు తీర్పు పైన స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మళ్లీ విచారణ జరపాలని కర్నాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌తో మాత్రం ఏకీభవించింది. దీంతో, నోటీసులు జారీ చేసింది.

కాగా, అక్రమాస్తుల కేసులో జయలలితకు కొద్ది నెలల క్రితం కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. దీంతో, ఆమె తమిళనాడు సీఎంగా మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇదిలా ఉండగా, జయలలితను నిర్దోషిగా కర్నాటక హైకోర్టు తేల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను నిర్దోషిగా తేల్చవద్దని, మరోసారి విచారణ జరిపించాలని కోరింది. హైకోర్టు తీర్పు పైన స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీం, మళ్లీ విచారణకు నోటీసులు మాత్రం జారీ చేసింది.












Click it and Unblock the Notifications