సిగ్గుచేటు: ములాయం రేప్ వ్యాఖ్యలపై జయప్రద

ములాయం సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు. ములాయం సింగ్‌కు మహిళలు ఓట్ల రూపంలో సమాధానం చెబుతారని ఆమె అన్నారు. ఆర్‌ఎల్‌డి అభ్యర్థి అమర్ సింగ్‌కు మద్దతుగా ఆమె రోడ్డు షోలో పాల్గొన్నారు.
స్థానిక మాండలికంలో మాట్లాడుతూ, మహిళలతో చేతులు కలుపుతూ అమర్ సింగ్‌కు ఓటేయాలని ఆమె ప్రజలను కోరారు. శనివారంనాడు శ్రీదేవి కూడా అమర్ సింగ్‌కు మద్దతుగా ప్రచారం సాగించారు.
ములాయం సింగ్ ఇటీవల అత్యాచార నిరోధక చట్టాన్ని తప్పు పట్టారు. కుర్రాళ్లు తప్పు చేస్తుంటారని, అంత మాత్రాన వారికి ఉరిశిక్ష విధించడం సరైంది కాదని ములాయం సింగ్ అన్నారు. ములాయం వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.












Click it and Unblock the Notifications