జయలలిత స్నేహితురాలు శశికళ భర్త అరెస్టు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ భర్త ఎం నటరాజన్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరునెల్వెలి జిల్లాలోని కోర్టుల్లంలో నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మార్షియల్ ఆర్ట్ నిపుణుడు, శిల్పకళాకారుడు షిహాహ్ హుస్సేనీని బెదిరించాడనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర పరిణామాలు ఉంటాయని నటరాజన్, ఆయన అనుచరులు తనను జూన్ 26వ తేదీన బెదిరించారని హుస్సేనీ ఫిర్యాదు చేశారు. నటరాజన్ సహాయకుడు కూడా ఆర్టిస్టును పిస్టల్‌తో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫ్రీజును చెక్కాలని నటరాజన్‌ హుస్సేనీ అడిగినట్లు సమాచారం.

Jaya's close aide Sasikala's husband arrested

దాన్ని నటరాజన్ శ్రీలంకలోని తమిళ బాధితులకు అంకితం చేయడానికి ముల్లివాయికాల్‌లో నెలకొల్పాలని అనుకున్నారు. నటరాజన్ హుస్సేనీకి 98 లక్షల రూపాయలు ఇస్తానని అంగీకరించి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాడని అంటున్నారు.

హుస్సేనీ ఫిర్యాదుపై జారీ చేసిన సమన్లకు నటరాజన్ ప్రతిస్పందించలేదు. ఆయనను దాంతో పోలీసులు అరెస్టు చేశారు. భూఆక్రమణల ఆరోపణపై నటరాజన్ 2012లో కూడా అరెస్టయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+