జయ అక్రమాస్తులు అంతే, అందుకే నిర్దోషి: కోర్టు ఏం చెప్పింది? మోడీ ఫోన్

చెన్నై: అక్రమాస్తుల కేసులో కర్నాటక రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. జయలలితతో పాటు మరో ముగ్గురిని నిర్దోషిలుగా చెప్పింది. ఉదయం పదకొండు గంటలకు న్యాయమూర్తి కుమార స్వామి 919 పేజీల తీర్పును వెల్లడించారు.

Jaya verdict: Properties obtained by taking loan, Jaya has always filed returns since young age

తీర్పులోని కీలక అంశాలు

- జయలలిత చిన్న నాటి నుండే ఐటీ రిటర్స్న్ ఫైల్ చేస్తున్నారు.
- నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుండి అప్పులు తీసుకొని ఆస్తులను కొన్నారు.
- ఆస్తుల జప్థు సరికాదు.
- సుధాకర్ పెళ్లి ఖర్చుపై ఊహాగానాలు.

జయలలిత అక్రమాస్తుల కేసులో కింది కోర్టు సాక్ష్యాలను సరిగా పరిగణించలేదని హైకోర్టు 919 పేజీల జడ్జిమెంట్‌ ఇచ్చింది. కిందిస్థాయి న్యాయస్థానం ఐటీ రిటర్న్సిను అసలు సాక్ష్యంగానే తీసుకోలేదని ధర్మాసనం పేర్కొంది. జయలలిత అక్రమాస్తులు కేవలం ఎనిమిది శాతమేనన్న కర్ణాటక హకోర్టు 10 శాతం లోపు అక్రమాస్తులుంటే నిర్దోషులుగా విడుదల చేయొచ్చని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేసింది.

Jaya verdict: Properties obtained by taking loan, Jaya has always filed returns since young age

ఈ కారణంగానే జయలలితను నిర్దోషిగా విడుదల చేశామని హైకోర్టు తెలిపింది. జయలలిత అక్రమాస్తులు రూ.2.82 కోట్లేనని, రూ.66.06 కోట్ల అక్రమాస్లున్నాయన్న ప్రాసిక్యూషన్‌ వాదనలో పసలేదని పేర్కొంది.

జయలలిత మైనర్‌గా ఉన్నప్పటి నుండి ఐటీ రిటర్స్న్ దాఖలు చేస్తున్నారని, నెంబర్ 36, పోయెస్ గార్డెన్, నాట్య కళా నికేతన్ ఆమెకు తన తల్లి నుండి వచ్చిందని పేర్కొంది. పోయెస్ గార్డెన్‌ను ఆనుకొని ఉన్న దానిని జయలలిత రూ.8 లక్షలకు కొనుగోలు చేశారని, అంతకుమించి ఆమె ఏం కొనలేదని న్యాయస్థానం పేర్కొంది. 10 నుండి 20 శాతం వరకు అక్రమాస్తులపై పరిమితి ఉందని చెప్పారు.

మోడీ, బీజేపీ అభినందనలు

అక్రమాస్తుల కేసు నుండి బయటపడిన జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అభినందనలు తెలిపింది. ఈ మేరకు మోడీ జయలలితకు ఫోన్ చేసి అభినందించారు.

మరోవైపు, తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. కోర్టులో కేసు గెలిచి నిర్దోషిగా నిలిచినందుకు అభినందలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు సౌందర్ రాజన్ చెప్పారు. కోర్టు తీర్పుతో తమిళ ప్రజలు ఎంతో ఉపశమనం పొందారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+