వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి మిస్టరీ-తమిళనాడు సీఎంకు ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక-ఏముందంటే ?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ కు తమ నివేదిక సమర్పించింది. మాజీ సీఎం జయలలిత ఏ పరిస్ధితుల్లో ఆస్పత్రిలో చేరారు, అనంతరం ఆమెకు జరిగిన చికిత్స, మరణం వరకూ చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ జరిపిన కమిషన్.. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

2017లో జయలలిత మరణంపై విచారణ కోసం అప్పటి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కార్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ విచారణ నివేదిక సమర్పించేందుకు గడువును ఏకంగా 14 సార్లు పొడిగించారు. చివరికి ఈ నెల 4న కూడా మరో పొడిగింపు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు కమిషన్ ఇవాళ తన నివేదికను సీఎం స్టాలిన్ కు సమర్పించింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జస్టిస్ ఆరుముఖస్వామి 150 మందికి పైగా సాక్షులను విచారించి 600 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ఇంగ్లీష్, తమిళంలో అందజేశారు.

jayalalitha death : justice Arumughaswamy commission report submit to cm stalin

ఈ నివేదికలో జయలలితకు అందించిన చికిత్సలో అపోలో హాస్పిటల్స్‌కు క్లీన్ చిట్ ఇస్తూ ఆర్ముఘస్వామి కమీషన్‌కు వైద్య నివేదికలతో సహాయం చేయడానికి ఏర్పాటైన ఎయిమ్స్ మెడికల్ ప్యానెల్ గతంలో తన నివేదికను సమర్పించింది దాని తుది నిర్ధారణతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఆర్ముగస్వామి కమిషన్ కూడా ఇదే అంశాలతో నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. నివేదికలో పూర్తి అంశాలు బహిర్గతం కాకపోయినా జయలలితకు అందిన చికిత్స విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాత్రం తెలుస్తోంది.

English summary
justice Arumughaswamy commission has submitted its report on former cm jayalalitha's death to tamilandu cm mk stalin today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X