బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ కోర్టుకు కాదు: నేరుగా జైలుకే, అక్కడే స్పెషల్ కోర్టు, 144 సెక్షన్

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ బుధవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోతున్న సందర్బంగా నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోతున్న సందర్బంగా కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు: పన్నీర్, తెర మీదకు'జయ'సెంటిమెంట్ !అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు: పన్నీర్, తెర మీదకు'జయ'సెంటిమెంట్ !

బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని ప్రత్యేక సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అశ్వథ్ నారాయణ ఎదుట బుధవారం శశికళ, ఆమె వదిన ఇళవరసి, దివాకరన్ లు లొంగిపోవలసి ఉంది. అయితే బుధవారం మద్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది.

Jayalalithaa DA Case will be appearing before Sessions court Judge Ashwathnarayana.

శశికళ తదితరులను బెంగళూరు-హోసూరు రోడ్డు సమీపంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే శాంతి భద్రతలకు సమస్య వస్తుందని గ్రహించిన పోలీసు అధికారులు సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులోని న్యాయమూర్తి ముందు హాజరుకావాలని శశికళ తదితరులకు సూచించారు.

గతంలో జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు విచారణ చేపట్టిన బెంగళూరులోని ప్రత్యేక సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయలలితతో సహ శశికళ, ఇళవరసి, దివాకరన్ లను దోషులుగా ప్రకటించారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.

సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే !సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే !

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులో శశికళ తదితరులు లొంగిపోవాలి. శశికళ తదితరులు కోర్టులో లొంగిపోవడానికి వస్తున్న సందర్బంగా ఆమె మద్దతుదారులు భారీ సంఖ్యలో వస్తారని పోలీసు అధికారులు పసిగట్టారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరప్పన అగ్రహార జైలు దగ్గర శశికళ మద్దతుదారులు బుధవారం ఎక్కువ మంది గుమికూడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి భారీగా పోలీసులను మోహరించారు.

English summary
Jayalalithaa's close confidante Sasikala Natarajan, Sasikala's nephew Sudhakaran and her sister-in-law Ilavarasi all convicted in DA Case will be appearing before Sessions court Judge Ashwathnarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X