జయలలిత ఎఫెక్ట్: సరిహద్దు ఉద్రిక్తత, దాడులొద్దని సీఎం
చెన్నై/బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ లభించక పోవడంతో బెంగళూరులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి పైన కర్నాటక హోంశాఖ మంత్రి జార్జ్ సమీక్షించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పరిస్థితిని వివరించారు. కర్నాటక, తమిళనాడు బార్డర్‌లోను ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తమిళనాడు సీఎం స్పందన

జయలలితకు బెయిల్ నిరాకరించడంతో అన్నాడీఎంకే అభిమానులు, పార్టీ కార్యకర్తలు పలువురు తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. జయ పైన ప్రేమ, అభిమానం ఉంటే శాంతంగా ఉండాలని మద్దతుదారులను కోరారు. ఎలాంటి దాడులు చేయవద్దని, నిరసన తెలపవద్దన్నారు. ప్రశాంతంగా ఉండటం ఒక్కటే జయ పట్ల తమ ప్రేమను తెలుపుతుందన్నారు.
కాగా, కర్ణాటక హైకోర్టు జయలలితకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తొలుత బెయిల్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. బెయిల్ తిరస్కరించడాన్ని టీవీలో చూసిన జయలలిత కుప్పకూలిపోయారు.












Click it and Unblock the Notifications