జయలలిత వీరాభిమాని: నిప్పంటించుకుని ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదటపడలేదని ఆందోళనతో ఆమె వీరాభిమాని, అన్నాడీఎంకే కార్యకర్త నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై జిల్లాకు చెందిన రాజవేల్ (21) గురువారం వేకువ జామున చికిత్స విఫలమై మరణించాడు.
ఇతను అన్నాడీఎంకే కార్యకర్త. జయలలితకు వీరాభిమాని. జయలలిత ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి రాజవేల్ విషాదంలో మునిగిపోయాడు. అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశాడు.

జయలలిత ఆరోగ్యంపై పుకార్లు వ్యాపించడంతో ఆందోళన చెందాడు. ఇటీవల జీవితంపై విరక్తి పెంచుకున్న రాజవేల్ తన శరీరం మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలైన అతనికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
మెరుగైన చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గురువారం వేకువ జామున మరణించాడు. బుధవారం చెన్నైలో జయలలిత అభిమాని, దినసరి కూలీ షఠ్ముగం అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications