జయలలిత చికిత్స రిపోర్టు: అపోలోకు వార్నింగ్ ఇచ్చిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై విచారణ చెయ్యడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సీరియస్ అయ్యి అపోలో ఆసుపత్రికి వార్నింగ్ ఇచ్చింది.

జయలలిత

జయలలిత

2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి నుంచి డిసెంబర్ 5వ తేదీ రాత్రిపోద్దుపోయే వరకు జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సందర్బంలో జయలలితకు ఎలాంటి చికిత్స అందించారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది.

జనవరి 12 డెడ్ లైన్

జనవరి 12 డెడ్ లైన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 75 రోజుల పాటు ఎలాంటి చికిత్స అందించారు అనే పూర్తి సమాచారం ఉన్న మెడికల్ రికార్డులు జనవరి 12వ తేదీ లోపు సమర్పించాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రికి ఆదేశాలు జారీ చేసింది.

అపోలో సైలెంట్ ?

అపోలో సైలెంట్ ?

జనవరి 10వ తేదీ పూర్తి అయినా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇంత వరకు జయలలిత చికిత్స మెడికల్ రికార్డులు సమర్పించకపోవడంతో బుధవారం సాయంత్రం ఆర్ముగుస్వామి విచారణ కమిషన్ సీరియస్ అయ్యింది.

అపోలోకు వార్నింగ్

అపోలోకు వార్నింగ్

వెంటనే జయలలిత చికిత్స మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని అపోలో ఆసుపత్రికి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. జయలలిత చికిత్స విషయంలో అపోలో ఆసుపత్రికి అధికారికంగా వార్నింగ్ లేఖ పంపించాలని ఆర్ముగస్వామి విచారణ కమిసన్ నిర్ణయించింది.

మొత్తం బయటకు వస్తోంది !

మొత్తం బయటకు వస్తోంది !

జయలలితకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆమె ఎవరెవరితో మాట్లాడారు, ఎంత మంది కలిశారు, చికిత్స ఎలా అందించారు తదితర పూర్తి వివరాలు అపోలో ఆసుపత్రి నుంచి సేకరించాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించిందని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Arumugasamy commission warns Apollo Hospital for not submitting the Jayalalitha Medical History in Commission. The Commission is also planning to write a warning letter to Apollo about submit the Jayalalithas medical History with jan12th.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి