వెంకయ్య రాక కోసం: అధికారుల్ని ఆదేశించిన జయలలిత

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన శనివారం నాడు ప్రశంసలు కురిపించారు. వెంకయ్యను తమిళనాడు ఆప్తమిత్రుడిగా ఆమె అభివర్ణించారు. చెన్నై మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టులో భాగంగా వాషర్ మెన్ పేట నుంచి వింకో నగర్ వరకు విస్తరిస్తున్న పథకానికి ఆమె శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తమిళనాడు ప్రయోజనాలను పరిరక్షించడంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను కేంద్రం అనుమతులు లభించేలా చూడటంలో ఆయన ముందుంటారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి లభించడంలో వెంకయ్య పాత్ర కీలకమన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాను వెంకయ్యతో ఆయన శాఖకు సంబంధించి రాష్ట్ర అంశాలపై చర్చించానని, ఈ విస్తరణ ప్రాజెక్టుకు అనుమతులు కోరానని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 13న చెన్నైలో తనతో మెట్రో ప్రాజెక్టు విషయమై శుభవార్త చెప్పారన్నారు.

వెంకయ్య, జయలలిత

వెంకయ్య, జయలలిత

మెట్రో విస్తరణలో వెంకయ్య నాయుడు పాత్ర చాలా కీలకమని, అందుకే ఆయన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండాలని తాను భావించానని జయలలిత అన్నారు.

మెట్రో ప్రాజెక్ట్

మెట్రో ప్రాజెక్ట్

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, వెంకయ్య నాయుడు ఈ ప్రారంభోత్సవంలో ఉండేందుకు అనువుగా.. సమావేశాలు లేని రోజున ప్రారంభోత్సవం చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేయాలని తాను అధికారులను ఆదేశించానని జయ తెలిపారు.

జయలలిత

జయలలిత

అందులో భాగంగానే పార్లమెంటు సమావేశాలు లేని శనివారం రోజున ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశామని, వెంకయ్య నాయుడు హాజరయ్యారని చెప్పారు.

జయలలిత

జయలలిత

ఈ కార్యక్రమానికి ముందు, చెన్నై విమానాశ్రయంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. గుజరాత్‌లో యువకుల పైన ఓ ముఠా దాడులను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో చూపిస్తూ, రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister J. Jayalalithaa lauded the efforts of Union Urban Development Minister Venkaiah Naidu for obtaining the Centre’s sanction for the Washermenpet-Tiruvottiyur-Wimco Nagar metro rail project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X