జైల్లోనే జయలలిత: విచారణ 6వ తేదీకి వాయిదా

జయలలిత పిటిషన్లు ముందుకు రాగానే - హైకోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ అపీల్స్ విషయంలో తనను ఎస్‌పిపిగా నియమిస్తూ ఏ విధమైన అధికారిక నోటిఫికేషన్ కూడా రాలేదని అదాయానికి మించి ఆస్తుల కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన జి. భవానీ సింగ్ చెప్పారు. తనకు గడువు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
వెంటనే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జయలలిత ఓ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు కింది కోర్టు తనను దోషిగా నిర్ధారించడాన్ని కూడా సవాల్ చేశారు. పలు తీర్పులను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని, ఆదాయం పన్ను ట్రిబ్యునల్ ఆదాయం పన్నుకు సంబంధించిన ఆదేశాలనూ నిర్ణయాలనూ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని జయలలిత తన పిటిషన్‌లో అన్నారు.
ఇదిలావుంటే, జయలలిత బెయిల్ పిటిషన్‌పై రేపు బుధవారం విచారణ అవకాశం ఉన్నట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. ప్రత్యేత ధర్మాసనం జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపవచ్చునని సమాచారం.
ఆదాయనికి మించి ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలవరసలను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications