వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ లేకపోవడం మాకు ప్లస్ పాయింట్ ! వెంకయ్య, ఎందుకంటే?

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత లేకపోవడం బీజేపీకి ఓ చక్కటి అవకాశం అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జయలలిత వ్యక్తిగతంగా తమిళనాడులో అపారమైన ప్రభావం చూపేవారని ఆయన గుర్తు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో జయలలిత లేకపోవడం బీజేపీకి ఓ చక్కటి అవకాశం అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జయలలిత వ్యక్తిగతంగా తమిళనాడులో అపారమైన ప్రభావం చూపేవారని ఆయన గుర్తు చేశారు.

అందు వలన మా సానుభూతిపరుల ఓట్లు కూడా ఆమెకు దక్కేవని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలో ఏది మంచి పార్టీ అంటే తాను అన్నాడీఎంకేనే అంటానని, జాతీయవాద దృక్పథమున్న పార్టీ అన్నాడీఎంకే అని వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖమీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ

జయలలితను వ్యక్తిగతంగా అభిమానించే బీజేపీ కార్యకర్తలు సైతం అన్నాడీఎంకే పార్టీకి ఓట్లు వేశారని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెంకయ్యనాయుడు వివరించారు. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

 Jayalalithaa’s absence a political 0pportunity for BJP in Tamil Nadu: Venkaiah Naidu

జయలలిత మరణించిన తరువాత తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వంను ఎంపిక చెయ్యడంలో తన పాత్రకూడా ఉందని వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు.

శశికళకు పన్నీర్ సెల్వం పాదాభివందనం: వైరల్ వీడియోశశికళకు పన్నీర్ సెల్వం పాదాభివందనం: వైరల్ వీడియో

పన్నీర్ సెల్వం పేరును ప్రతిపాదించడానికి నేను ఎవరిని ? అని అన్నారు. అన్నాడీఎంకే శాసన సభ్యులు పన్నీర్ సెల్వంను సీఎంగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యర్శిగా ఎంపిక అయిన శశికళను మీరు అభినందించారు కదా అని మీడియా ప్రశ్నించగా వెంకయ్యనాయుడు ఇలా సమాదానం ఇచ్చారు.

తాను శశికళను కాకుండా తమిళనాడు ప్రజలను అభినందించానని, తీవ్రవిషాద పరిస్థితిల్లోనూ వారు క్రమశిక్షణతో మెలిగారని వెంకయ్యనాయుడు చెప్పారు. జయలలిత మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ వైద్యపరిక్షలు నిర్వహించాలన్న డిమాండ్లను వెంకయ్యనాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు.

శశికళ చేతిలో నాయకుల జాతకాలు: అందుకే నాటకాలుశశికళ చేతిలో నాయకుల జాతకాలు: అందుకే నాటకాలు

కొందరు ఎప్పుడూ అనుమానంతోనే బతుకుతారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. నేను డాక్టర్ ని కాదు, డాక్టర్లతో విభేదించే జ్ఞానం కూడా తనకు లేదని జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నాయకులకు వెంకయ్యనాయుడు చురకలు అంటించారు.

అనుమానపు పక్షులు ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేస్తుంటాయని, అదే అనుమానంతో బతికేస్తుంటారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. తమిళనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

English summary
Union Minister Venkaiah Naidu said that the absence of former Tamil Nadu Chief Minister Jayalalithaa due to her death had created a political opportunity for BJP in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X