అత్యంత విషమంగా జయ ఆరోగ్యం: చివరి అస్త్రంగా ఎక్మో చికిత్స, మధుమేహమే అడ్డు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. చివరి అస్త్రంగా ఎక్మో యంత్రం పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. చివరి అస్త్రంగా ఎక్మో యంత్రం పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని అంటున్నారు. ఆమె వైద్యానికి మధుమేహం అడ్డు వస్తుందని చెబుతున్నారు.
ఆమె 74 రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఉంటున్నారు. లండన్ వైద్యులు డేవిడ్ బాలే ఆమెకు ఇటీవలి వరకు చికిత్స అందించి, ఆ తర్వాత వెళ్లిపోయారు. ఆయన సూచనలను అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు.

తాజాగా, సోమవారం రిచర్డ్ బాలే చెన్నై వస్తున్నారు. ఆమెకు చికిత్స అందించనున్నారు. జయకు ఎయిమ్స్, అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్మో, లైఫ్ సపోర్టింగ్ సిస్టంతో చికిత్స అందిస్తున్నారు. మరికొద్ది రోజులు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచాలని చెబుతున్నారు. హృద్రోగ, శ్వాసకోశ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు మూడు గంటలకు అపోలో ఆసుపత్రికి చేరుకుంటారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయనున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications