తమిళనాడు అమ్మ జయలలిత బంగ్లాలో అగ్ని ప్రమాదం!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కాంచీపురం జిల్లాలోని సిరుత్వూరు ప్రాంతంలోని బంగ్లా ఆవరణంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటని అధికారులు ఆరా తీస్తున్నారు.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని సిరుత్వూరు ప్రాంతంలో జయలలితకు ఓ బంగ్లా ఉంది. జయలలిత ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే ఈ బంగ్లాకు వెళ్లేవారు. జయలలిత మరణించిన తరువాత ఆ బంగ్లాకు తాళం వేసిన పనిమనుషులు వారు మాత్రం అక్కడే ఔట్ హౌస్ లో ఉంటున్నారు.

బుధవారం మద్యాహ్నం జయలలిత బంగ్లా కాంపౌండ్ సమీపంలో మంటలు చెలరేగాయి. విషయం గుర్తించిన బంగ్లాలో పని చేస్తున్న వారు స్థానికుల సహకారంతో మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications