దిగ్భ్రాంతికి గురయ్యా, అంతవరకు ఆగండి: సంక్షోభం, పన్నీరు పిలుపుపై దీప

సీఎం పదవి కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా మరో వైపు జయ మేనకోడలు దీపా జయకుమార్‌ రాజకీయరంగ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో ఆమె బుధవారం స్పందించారు.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు. సీఎం పదవి కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా మరో వైపు జయ మేనకోడలు దీపా జయకుమార్‌ రాజకీయరంగ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో ఆమె బుధవారం స్పందించారు.

'ముందుగా చెప్పినట్లు ఫిబ్రవరి 24న నా నిర్ణయం ప్రకటిస్తా. నేను స్వయంగా ప్రకటించే లోపు వదంతులు నమ్మవద్దు. ఈలోపు రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సి వస్తే నేనే స్వయంగా చెబుతా' దీపా జయకుమార్ తన మద్దతుదారులకు, ప్రజలకు స్పష్టం చేశారు.

Jayalalithaa’s niece Deepa Jayakumar dubs turn of events in Tamil Nadu ‘shocking’

పన్నీరు సెల్వం తనను ఆహ్వానించిన విషయాన్ని కేవలం మీడియా ద్వారానే తెలుసుకున్నానని.. వ్యక్తిగతంగా ఎలాంటి పిలుపు రాలేదని దీపా జయకుమార్ తెలిపారు. అయితే, తమిళ ప్రజలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదని చెప్పారు. పన్నీరుసెల్వం వెనక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలను దీప తప్పుబట్టారు.

మద్దతుదారుల ఆందోళన

అధికారాన్ని చేజిక్కించుకోవడానికి శశికళ పథకం ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా తన మద్దతుదారులను నిర్వాహకులుగా నియమించిందని సేలంలో దీపా జయకుమార్ మద్దతుదారులు ఆరోపించారు. దీప మద్దతుదారు, మాజీ ఎమ్పీ అర్జునన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం దీపకు పిలుపునివ్వడం ఆహ్వానించదగిన అంశమన్నారు. అన్నాడీఎంకే నుంచి శశికళను వెళ్లగొట్టేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. పన్నీర్‌ సెల్వం మద్దతుదారులతో కలిసి పని చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+