జయలలితకు పాదాభివందనాలు, 'ఇంత దారుణం ఊహించలేదు'

చెన్నై: తమిళనాడులో చరిత్రను తిరగరాస్తూ రెండోసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కుతున్న ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, అన్నాడీఎంకే నేతలు ఆప్యాయంగా విప్లవనాయకిగా పిలుచుకునే ఆమెకు అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య నుంచి మంత్రుల వరకూ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం ఎంతోమంది నేతలు ఆమెకు చాలామంది పుష్పగుచ్ఛాలిచ్చి పాదాభివందనాలు చేశారు.

Jayalalithaa Sets 34 Year Record, Says Have No Words To Thank Tamil Nadu

ఆమె మెప్పును పొందాలని కోరుకుంటున్న కొందరు తమిళ నేతలు ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశారు. వారందరి అభినందనలను చిరునవ్వుతో స్వీకరించిన జయలలిత, ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.. తన ఆనందానికి డిక్షనరీలో మాటలులేవు అన్నారు. మూడు దశాబ్దాల తర్వాత తనను తిరిగి ఎన్నుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

కాగా, జయలలితకు పాదాభివందనాల పైన సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అన్నాడీఎంకే విజయం సాధించిన నేపథ్యంలో వీఐపీ వీవీఐపీలు అమ్మ కాళ్లకు సాష్టాంగ నమస్కారాలు చేయడం దుమారం రేపుతోంది. అభిమానం హద్దులు దాటిందని, బానిసత్వానికి తమిళనాడులో ఇలాంటివి పరాకాష్ఠగా నిలుస్తున్నావని అంటున్నారు.

ఇది ఊహించలేదు: అచ్యుతానందన్

ఇంత దారుణమైన, భారీ ఓటమిని తాము ఊహించలేదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎన్నడూ ఊహించని ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని భావించామన్నారు. కానీ అలా జరగలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+