సంచలనం:'అమ్మ ఆత్మ నాతో మాట్లాడింది, పన్నీర్, దీపలే పార్టీని రక్షించాలి'
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని తిరువరూరుకి చెందిన శ్రీ మహరిషీ అనే సాధువు చేసిన ప్రకటన సంచలనం కల్గించింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కలిశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని తిరువరూరుకి చెందిన శ్రీ మహరిషీ అనే ఓ సాధువు మంగళవారం నాడు ప్రకటించడం సంచనలం కల్గించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్ళి శ్రీ మహరిషి అనే సాధువు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని చెప్పారు.
పన్నీర్ సెల్వం నివాసం ఉంటున్న గ్రీన్ వేస్ రోడ్డు ప్రాంతానికి వెళ్ళి సాధువు శ్రీ మహరిషి వెళ్ళి కలిశాడు.ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకొన్నారు.

అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని ఆసుపత్రిలో తనకు 75 రోజుల పాటు ఉంచారని చెప్పిందన్నారు. అక్కడున్నవారంతో ఖంగుతిన్నారు.అన్నాడిఎంకె పార్టీని పన్నీర్ సెల్వం, దీప జయకుమార్ లే రక్షించాలని జయలలిత ఆత్మ కోరిందని ఆయన చెప్పారు.
పన్నీర్ సెల్వం, దీప కలిసి ఎఐడిఎంకె ను రక్షించాలని చెప్పారని పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలతో పన్నీర్ సెల్వం ఇంటి ముందు కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications