వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనకు తానే వలలో, తెలియకుండా: జయలలితపై కరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. జయలలిత విషయమై ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ఇన్నాళ్లకు స్పందించారు. పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దాదాపు 12 రోజులకు స్పందించారు.

జయలలిత తనకు తానే వలలో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. తనను ఎవరు ప్రశ్నించలేరనే పరిస్థితిని సృష్టించిన జయలలిత ఇప్పుడు తన పతనం తాలుకూ పాఠాలు తానే చదువుకునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఆమె తిరిగి అధికారంలోకి రావడం కల్ల అన్నారు.

'Jayalalithaa Trapped Herself In The Net', Says Karunanidhi

ద్రవిడ ఉద్యమాన్ని పైకి తీసుకు రావడానికి జయ తనకు తెలియకుండానే మాకు అవకాశం కల్పించారని అన్నారు. తిరిగి జయలలిత అధికారంలోకి రాలేదని, అది కలగానే మిగిలిపోతుందన్నారు.

కాగా, పద్దెనిమిదేళ్ల నాటి అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆస్తుల కేసులో ఆమెకు కర్నాటక కోర్టు నాలుగేళ్ల శిక్షను, వంద కోట్ల రూపాయల జరిమానాను విధించింది. కర్నాటక హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, చుక్కెదురైంది.

English summary
Jayalalithaa's arch rival, the 92 year-old DMK chief M Karunanidhi, has predicted that her "comeback to power can only be a dream. It would never be fulfilled."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X