శశికళను సెంట్రల్ జైల్లో నుంచి బయటకు పిలుచుకెళ్లింది ఇతనే, షాపింగ్ (వీడియో)
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి శశికళ బయటకు వచ్చారనే విషయంపై సోమవారం మీడియాలో వార్తలు రావడంతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. శశికళను జైల్లో నుంచి బయటకు పంపించిన అధికారులు ఎవరు ? అని ఆరా
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి శశికళ బయటకు వచ్చారనే విషయంపై సోమవారం మీడియాలో వార్తలు రావడంతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. శశికళను జైల్లో నుంచి బయటకు పంపించిన అధికారులు ఎవరు ? అని ఆరా తీస్తున్నారు.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని, ఆమెకు వీవీఐపీ మర్యాదలు చేస్తున్నారని, జైల్లో ఐదు గదులు శశికళకు కేటాయించారని జులైలో కొన్ని ఫోటోలు బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఇప్పుడు శశికళ, ఆమె వదిన ఇళవరసి ఏకంగా జైలు నుంచి బయటకు వచ్చి షాపింగ్ చేసి చేతుల్లో ఖరీదైన బ్యాగులు పెట్టుకుని తిరిగి జైలు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెలుతున్న ఓ వీడియో బయటకురావడంతో కలకలంరేగింది. శశికళ జైల్లో కూడా మామూలు దుస్తులు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయంత్ బెంగళూరు చేరుకుని మేనత్త శశికళ, ఇళవరిసిని షాపింగ్ తీసుకెళ్లారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శశికళ జైల్లో నుంచి బయటకురాలేదని, విజిటర్స్ గదిలోకి వచ్చి వెలుతున్న సమయంలో సీసీకెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ చూసి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని సోమవారం జయంత్ చెన్నైలో చెప్పారు.












Click it and Unblock the Notifications