చరణ్ సింగ్ కు భారతరత్న- ఇండియా కూటమికి మనవడి పార్టీ గుడ్ బై- ఎన్డీయేలోకి జంప్ !
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్రం అవార్డుల పేరుతో చేస్తున్న రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. యూపీలో అన్నీ సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని, రైతు నేతగా పేరున్న చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న అవార్డు ప్రకటించింది. తద్వారా యూపీతో పాటు చుట్టుపక్కన రాష్ట్రాల రైతుల్లో ఆయనకు ఉన్న పేరును క్యాష్ చేసుకోవాలనేది బీజేపీ ఆలోచన.
మరోవైపు కేంద్రం దివంగత చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న అవార్డు ప్రకటించగానే.. యూపీలో ఉన్న ఆయన మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయ కూటమిలో చేరేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే ప్రతీ ఎన్నికల సమయంలో కూటముల్ని, మిత్రపక్షాల్ని మార్చేసే అలవాటు ఉన్న ఆర్ఎల్డీ.. మరోసారి ఎన్డీయే పంచన చేరబోతోంది.

చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ ప్రధాని మోడీ ఎక్స్ లో చేసిన పోస్టును సమాధానంగా ఆఫర్ ను ఎలా తిరస్కరించగలనంటూ ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి పెట్టిన పోస్టు ఏం జరగబోతోందో చెప్పకనే చెప్పేసింది.
ఇవాళ ప్రధాని మోడీ చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ తనను అభినందిస్తూ పోస్టు పెట్టినప్పుడు సీట్లు, ఓట్ల గురించి మాట్లాడటం దాని విలువను తగ్గించినట్లవుతుందని జయంత్ తెలిపారు. ప్రధానమంత్రి మోడీ దేశం యొక్క ప్రాథమిక మనోభావాలు, స్వభావాన్ని అర్థం చేసుకున్నారని రుజువు చేసే నిర్ణయం తీసుకున్నారని జయంత్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications