ఆర్‌ఎల్‌డిలోకి జయప్రద: బిజ్నోర్ నుంచి పోటీకి రెడీ

అమర్ సింగ్‌తో పాటు జయప్రద ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి పోటీ బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరు ఏ పార్టీలోనూ చేరలేదు. జయప్రద కాంగ్రెసులో చేరి మొరాదాబాద్ నుంచి లోకసభకు పోటీ చేస్తారంటూ ఇటీవ వార్తలు వచ్చాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తానని అప్పట్లో జయప్రద చెబుతూ వచ్చారు. రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె ఉత్సుకత ప్రదర్సించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాంగ్రెసు తరఫున రాజమండ్రి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. అంతే కాకుండా అమర్ సింగ్ సూచనను బట్టే తన భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుందని కూడా చెబుతూ వచ్చారు. చివరకి ఆర్‌ఎల్‌డితో సర్దుకుపోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications