Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటకలో ముందే చేతులెత్తేసిన జేడీఎస్ కుమారస్వామి; 10మంది స్వతంత్రులతో కాంగ్రెస్ సంప్రదింపులు!!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతుండగా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పావులు కదులుతున్నాయి. ఈసారి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి.

ప్రత్యర్థి పార్టీలలో విజయం సాధించే ఎమ్మెల్యేల పైన, విజయావకాశాలు ఉన్న స్వతంత్ర అభ్యర్థుల పైన ప్రధానంగా అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పది మంది స్వతంత్ర అభ్యర్థులతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎక్కువ మంది స్వతంత్రులు తిరుగుబాటు అభ్యర్థులు గెలుస్తారు అంచనాలకు అనుగుణంగా అధికార విపక్ష పార్టీ నేతలు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.

Karnataka Assembly Election Results 2023

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తమ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో పది మంది స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి వారితో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం.ఇదిలా ఉంటే నిన్నటిదాకా తాము కింగ్ ల మనీ, కింగ్ మేకర్ కాదని చెప్పిన జెడిఎస్ పార్టీ అధినేత హెచ్డి కుమారస్వామి ప్రస్తుతం మాట మార్చారు.

తమ పార్టీ చిన్న పార్టీ అని, తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం తమ అవసరం ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అంత డిమాండ్ కూడా లేదని చెప్పారు జేడీఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి. కాంగ్రెస్, బీజేపీ నాయకులెవరూ తమను సంప్రదించింది లేదన్నారు.

Karnataka Assembly Election Results 2023

ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ కూడా క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలుపు అవకాశం ఉన్న ఎమ్మెల్యేలనే తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. స్వతంత్ర అభ్యర్థులను సైతం వదలకుండా బిజెపి క్యాంప్ రాజకీయాలు చేస్తోంది. మొత్తంగా చూస్తే కొనసాగుతున్న స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఏ పార్టీకి నమ్మకం లేకపోవడంతో, ఎవరి ప్రయత్నాల్లో వారు క్యాంప్ రాజకీయాలకు తెర తీసినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+