సింగపూర్ నుంచే చక్రం తిప్పుతున్న కుమారస్వామి.. కీలక మారనున్న జేడీఎస్..
కర్టాటక ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారి ఉత్కంఠను రేపుతుంటే జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్‌లో విహారయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై సింగపూర్ నుంచి ఆయన సమీక్షిస్తున్నారు. తమ పార్టీ నేతలు, తండ్రి హెచ్ డీ దేవగౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
కడపటి వార్తలు అందేసరికి జేడీఎస్ దాదాపు 40 సీట్లలో అధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించే వ్యూహాలను దిగువస్థాయి నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మంగళవారం రాత్రికి కుమారస్వామి బెంగళూరుకు తిరిగిరానున్నారు. ప్రస్తుతం కుమారస్వామి వైపే అన్ని వర్గాలు దృష్టిసారించాయి. కర్ణాటక, దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ఈ ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారోనని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.













Click it and Unblock the Notifications