ABP-C Voter Opinion Poll:మరోసారి నితీశ్ పాగా.. కూటమికి మెజార్టీ సీట్లు..ఏబీపీ సర్వే
బీహర్‌లో తిరిగి జేడీయూ-బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని ఏబీపీ సీ ఓటర్ ఓపినీయన్ పోల్ అంచనా వేసింది. నితీశ్ కుమార్ నాలుగోసారి సీఎం పదవీ చేపట్టబోతున్నారని లెక్కగట్టింది. బీహర్ ఓటర్లు మరోసారి నితీశ్ కుమార్‌కు పట్టం కట్టబోతున్నారని తెలిపింది. జేడీయూ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ వస్తోందని తెలిపింది.
Recommended Video
బీహర్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 122 మెజార్టీ మార్క్ దాటాలి.. అయితే ఏబీపీ సర్వే ప్రకారం నితీశ్ కూటమికి 135 నుంచి 159 సీట్లు వస్తాయని లెక్కగడుతోంది. విపక్ష ఆర్జేడీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందని చెప్పింది. ఈ కూటమికి 77 నుంచి 98 సీట్ల వరకు వస్తాయని తెలిపింది. ఇక ఎల్జేపీ ప్రభావం చూపదని.. 1 నుంచి 5 సీట్లు మాత్రమే గెలచుబోతుందని అంచనా వేసింది. ఇతరులు కూడా 4 నుంచి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటారని.. జేడీయూకు పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో ఇండిపెండెంట్ల ప్రభావం ఉండబోదని తెలిపింది.

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్‌తో బీహరీలు సొంత రాష్ట్రానికి వచ్చారు. ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ముజఫర్ నగర్ షెల్టర్ హోం కేసు.. తదితర అంశాలు నితీశ్ ప్రభుత్వాన్ని ఇరుకన పెడతాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ.. ఏబీపీ సర్వే చెప్పింది. అయితే ఇదీ నిజమవుతుందే తలకిందులు అవుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
బీహర్‌లో మూడు విడతల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత ఎన్నిక 28వ తేదీన జరగబోతుంది. మరో రెండు విడతల పోలింగ్ తర్వాత.. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. వయోజనులను ఆకట్టుకొనేందుకు పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications