నాలుగు కావాలి, మంత్రి పదవులపై జేడీయూ బెట్టు, మోడీ మదిలో ఏముందో..?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. తమకు చోటు దక్కుతుందని ధీమాతో ఉన్నారు. ఏ పోర్టు ఫోలియో కన్నా.. ఎన్ని స్థానాలు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా జేడీయూ ఎక్కువగానే ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. తమకు నాలుగు బెర్తులు కావాలని ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ బాహాటంగానే అంటున్నారు. మరీ దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.

ఇప్పుడే కాదు ఇదివరకు కూడా జేడీయూ ఎక్కువ బెర్తులు ఆశించింది. కానీ గత క్యాబినెట్‌లో చోటు లభించలేదు. మరీ ఈ సారి ఏం జరుగుతుందనే టెన్షన్ మాత్రం ఉంది. మంత్రివర్గం కూర్పునకు సంబంధించి చర్చించేందుకు ప్రధాని మోడీ తన నివాసంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరిగినా.. ఆ సమావేశం రద్దయినట్లు కూడా కొందరు చెప్తున్నారు.

jdu Wants Four Ministries In central Cabinet: Sources

బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల్లో భాగంగా పదవులు దక్కే అవకాశం ఉన్నవారి జాబితాలో జ్యోతిరాదిత్య సింథియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, పశుపతి పరస్, అనుప్రియ పటేల్, పంకజ్ చౌదరి, రీటా బహుగుణ జోషీ, రామ్‌శంకర్ కథేరియా, వరుణ్ గాంధీ, ఆర్‌సీపీ సింగ్, లల్లన్ సింగ్, రాహుల్ కశ్వన్, సీపీ జోషీ ఉన్నారు.

వీరిలో జ్యోతిరాదిత్య సింథియా, రామ్‌శంకర్ కథేరియా, నారాయణ్ రాణే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మిగిలినవారు ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు తెలంగాణ నుంచి ధర్మపురి అర్వింద్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి మంత్రివర్గంలో మోడీ స్నేహితుడు.. కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+