
JEE Main 2021 Exam Date: జులై 20 -ఆగస్టు 2 మధ్య మూడో, నాలుగో సెషన్స్ -వివరాలివే
ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంగజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి గానూ నిర్వహించే 'జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)పై ఉత్కంఠ తొలగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ 2021 షెడ్యూల్ ఓడిదుడుకులకు గురికాగా, సవరించిన తేదీలను ఖరారు చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.
దీదీగిరికి
అడ్డులేదిక:
శాసన
మండలి
బిల్లుకు
ఆమోదం
-మోదీ-బీజేపీకి
మండేలా
ఏటా
'ఖేల
హోబే
దివస్’
జేఈఈ మెయిన్స్ 2021 మూడో దశ, నాలుగో దశపరీక్షల తేదీలను మంత్రి పోఖ్రియాల్ వెల్లడించారు. జేఈఈ మెయిన్ 2021 మూడో సెషన్ పరీక్షలు జూలై 20 నుంచి 25 తేదీ వరకు జరుగుతాయని, నాలుగో సెషన్ పరీక్షలు 2021 జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థుల కోసం అప్లికేషన్ విండోను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

మూడో దశ (ఏప్రిల్ సెషన్) పరీక్షకు జూలై 6 నుంచి జూలై 8 వరకు, నాలుగో దశ(మే సెషన్) పరీక్షకు జూలై 9 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిజానికి ఈ పరీక్షలు ఏప్రిల్, మేలోనే జరగాల్సి ఉన్నా, కొవిడ్ కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి.
రామా
అన్న
పదం
కూడా
బూతుగా?
-అసదుద్దీన్
ఓవైసీ
కంటికి
ఆర్ఎస్ఎస్
చీఫ్
క్రిమినలా?:
విజయశాంతి
జేఈఈ మెయిన్స్ 2021పై కేంద్రం క్లారిటీ ఇచ్చేయడంతో ఇక మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET పైనా ఓ నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.