JEE Main 2022: తొలి సెషన్ పరీక్ష జూన్‌కు, రెండో సెషన్ జులైకి వాయిదా, రీషెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) మరోసారి రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన సెషన్ 1 పరీక్షలను జూన్ 20 నుంచి జూన్ 29 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక, మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన రెండో సెషన్ పరీక్షలను జులై 21 నుంచి 30 వరకు నిర్వహించనుంది.
మరోవైపు, వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ)-2022కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈసారి మొత్తం 543 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 11.50 గంటల నుంచి మే 6న రాత్రి 11.50 గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.

పరీక్ష నిర్వహించే నగరాలు, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. జులై 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
Recommended Video

Application Process for NEET (UG) 2022 is now open. All the best. @EduMinOfIndia pic.twitter.com/fYibGc0JaB
— National Testing Agency (@DG_NTA) April 6, 2022
ఫీజు వివరాల్లోకి వెళితే.. జనరల్ కేటగరీ విద్యార్థులకు ఫీజు రూ. 1600, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీఎల్ విద్యార్థులకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ విద్యార్థులకు రూ. 900 ఫీజుగా నిర్ణయించారు. విదేశీ విద్యార్థులు రూ. 8500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, తొలిసారిగా దేశం బయట 14 నగరాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.
JEE (Main)dates rescheduled to enable students across the country to prepare well for the exams. @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/QYABHnd7SC
— National Testing Agency (@DG_NTA) April 6, 2022












Click it and Unblock the Notifications