వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతా వికాస్.. జీతా గుజరాత్: ట్విట్టర్‌లో మోడీ ఆనందం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇటు గుజరాత్‌లో కమలం మళ్లీ వికసించగా, అటు హిమాచల్ ప్రదేశ్‌నూ బీజేపీ హస్తగతం చేసుకుంది.

గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఆరోసారి విజయం సాధించింది. గత ఎన్నికల కంటే ఈసారి కాస్త సీట్లు తగ్గినా ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌ను బిజేపీ తిరిగి నిలబెట్టుకుంది. ఈ విషయంపై మోడీ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ట్విట్టర్‌లో మోడీ ఆనందం...

ట్విట్టర్‌లో మోడీ ఆనందం...

‘జీతా వికాస్.. జీతా గుజరాత్.. జయజయ గర్వీ గుజరాత్..' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల విజయంతో ‘కాంగ్రెస్ ముక్తి భారత్' నినాదానికి బీజేపీ మరింత చేరువైందనే చెప్పాలి. తాజా విజయంతో మొత్తంగా 19 రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీలు పాగా వేసినట్లయింది.

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన రాహుల్ ప్రచారం...

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన రాహుల్ ప్రచారం...

గుజరాత్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 115 స్థానాలు కైవసం చేసుకుంది. అప్పుడు కాంగ్రెస్ 61 స్థానాల్లో గెలిచింది. ఈసారి బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గగా, కాంగ్రెస్‌ బలాన్ని కాస్త పెంచుకోగలిగింది. నిజానికి గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటి ఇచ్చింది. రాహుల్ ప్రచారం కాంగ్రెస్‌కు బాగానే కలిసొచ్చింది.

మోడీ చరిష్మాతో గట్టెక్కిన బీజేపీ...

మోడీ చరిష్మాతో గట్టెక్కిన బీజేపీ...

గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోడీ చరిష్మాతోనే బీజేపీ గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. సీఎం అభ్యర్థి విజయ్ రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ సౌరాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. మధ్య గుజరాత్‌లో మాత్రం రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉత్తర గుజరాత్‌లో మాత్రం ఓటర్లు బీజేపీకే అండగా నిలబడ్డారు.

ఈవీఎంలు ఎందుకు ట్యాంపరింగ్ కావు...

ఈవీఎంలు ఎందుకు ట్యాంపరింగ్ కావు...

గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని పటేల్ సామాజిక వర్గం నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. అయితే హార్దిక్ పటేల్ ఆరోపణలను ఎన్నికల సంఘం తోచిపుచ్చింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుపొందిన బీజేపీకి శుభాకాంక్షలు అంటూ ఆయన బీజేపీపై వ్యంగ్యాస్త్రం విసిరారు. ఏటీఎంలనే హ్యాక్ చేస్తున్నప్పుడు.. ఈవీఎంలు ఎందుకు ట్యాంపరింగ్ కావని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రోజుల తరబడి ఈవీఎంలను పక్కనపెట్డడం సరికాదన్నారు. గుజరాత్ ప్రజలు రాజకీయంగా మరింత చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని హార్దిక్ పటేల్ అభిప్రాయపడ్డారు.

English summary
BJP won in Gujarat again and this time it captured Himachal Pradesh also. BJP retained Prime Minister Modi's own state Gujarat again. On this Modi expressed his happiness in Twetter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X