బాంబు బెదిరింపు: మస్కట్‌లో దిగిన జెట్‌ఎయిర్‌వేస్‌

ముంబై/మస్కట్: బాంబు బెదిరింపుతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఒమన్‌ రాజధాని మస్కట్‌లో అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి దుబాయి వెళ్తున్న 9డబ్ల్యు 536నెంబరు విమానం బాంబు బెదిరింపు కారణంగా దారి మళ్లించి మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు.

54 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారు. స్థానిక భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Jet Airways flight makes emergency landing in Muscat after midair bomb scare

తనిఖీలు పూర్తయిన తర్వాత తిరిగి జెట్ ఎయిర్‌వేస్ ఇక్కడ్నుంచి బయల్దేరుతుందని ఓమన్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టరీ తెలిపారు. బాంబు బెదిరింపు కారణంగా ఎయిర్ పోర్టును పది నిమిషాల పాటు మూసివేశారు.

ఇటీవల ఓ టర్కీష్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం దిగింది. తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+