మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గిన బీజేపీ

Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

Jharkhand Assembly elections 2024 BJP will contest from 68 of the 81 seats

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఈ క్రమంలో మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది. సీట్ల పంపకాలను కుదుర్చుకుంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయబోతోంది. తన మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 10 సీట్లను కేటాయించింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యాన్ని వహిస్తోన్న జనతాదళ్ (యునైటెడ్)కు రెండు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జన్‌శక్తి పార్టీకి ఒక సీటును ఇచ్చింది. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, సహ ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

సిలి, రామ్‌గఢ్, గోమియా, ఇసర్గా, మండు, జుగ్‌సలాయ్, డుమ్రి, పాకుర్, లోహర్‌దాగ, మనోహర్‌పూర్ నియోజకవర్గాలను ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు కేటాయించినట్లు తెలిపారు. టమర్, జంషెడ్‌పూర్‌లల్లో జేడీయూ, ఛాత్రాలో ఎల్జేపీ పోటీ చేస్తాయనని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+