ఎమ్మెల్యే గారు ఒక్కసారి జై శ్రీరాం అనండి... మంత్రి వివాద స్పద వ్యాఖ్యలు
కేంద్రంలో బీజీపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జై శ్రీ రాం నినాదం ఊపందుకుంది. దీంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ నినాదంతో అటు పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో రాజకీయా విమర్శలకు సైతం కారణమవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఈ నినాదంతో రాజకీయ యుద్దం నెలకోన్న నేపథ్యంలోనే ఏకంగా ఈ నినాదం మంత్రులకు సైతం తాకింది.

మీరు బాబరు వారసులు కాదు, రాముడి వారసులు
ఈ నేపథ్యంలోనే జైశ్రీరాం నినాదాలు కార్యకర్తల నుండి మంత్రులకు కూడ పాకింది. తాజాగా జార్ఖండ్ మంత్రి ఇలాంటీ అరోపణలు ఎదుర్కోంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సీపీ సింగ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారీటి ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీని జై శ్రీరాం అనాలంటూ చెప్పాడు. ఇర్ఫాన్ జీ జై శ్రీరాం అని గట్టిగా అనండి, మీ పూర్వికులు రాముడి వంశానికి చెందిన వారు కాని బాబర్ వంశానికి చెందిన వారు కాదు అంటూ అడిగాడు.

ఉద్యోగాలు మౌలిక వసతులు కల్పించండి..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సైతం మంత్రి వ్యాఖ్యలపై స్పందించాడు. ముందు గ్రామాల్లో మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించండి, అని హితవు పలకడంతో పాటు రాముడి పేరును బద్నాం చేయకండి అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి.

శ్రీరాం నినాదంపై ప్రధానికి లేఖ రాసిన ప్రముఖులు
కాగా రెండు రోజుల కేరళకు చెందిన ప్రముఖ రచయిత అదూర్ గోపాల క్రిష్ణన్ తోపాటు 49మంది సెలబ్రెటిలు జై శ్రీరాం నినాదంపై ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే... ఈ నినాదం మూకుమ్మడి దాడులకు పురికొల్పుతుందని దీంతో లా అండ్ అర్డర్ సమస్య కూడ ఉత్పన్నమవుతుందని లేఖలో పేర్కోన్నారు. మరోవైపు మతాల మధ్య హింస చెలరేగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులను ఆపాలని ప్రధానిని కోరారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications