అయ్యో.. ఐదుగురు చిన్నారులకు HIV పాజిటివ్ రక్తం ఎక్కించి..

వైద్యో నారాయణో హరి అని పెద్దలు అంటారు. తల్లిదండ్రులు, గురువు తర్వాత చేతులెత్తి మొక్కేది ఆ వైద్యులకే. అయితే కొంత మంది వైద్యులు మాత్రం రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం ఐదుగురు చిన్నారుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. అప్పటికే తలసేమియా అనే భయంకరమైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారులకు వైద్యులు ఇప్పుడు పొరపాటున HIV పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీనిపై ఝార్ఖండ్ హైకోర్టు సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

ఝార్ఖండ్ లో ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు చిన్నారుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఝార్ఖండ్ లోని చాయ్ బసా టౌన్ అప్పటికే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు వైద్యులు నిర్లక్ష్యంతో HIV పాజిటివ్ రక్తం ఎక్కించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణ జరిపి ఐదుగురు చిన్నారుల నుంచి సమాచారం సేకరించింది. దర్యాప్తులో ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో కలుషితమైన రక్తం ఉన్నట్లు తేలిందన్నారు.

ఇటీవల ఓ ఏడేళ్ల తలసేమియా బాధిత చిన్నారి కుటుంబం చాయ్ బసా టౌన్ లోని ఓ బ్లడ్ బ్యాంక్ లో తమ చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారని ఆరోపణలు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబం ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన బృందం.. బ్లడ్ బ్యాంకులో ఆ చిన్నారికి 25 యూనిట్ల కలుషిత రక్తం ఎక్కించినట్లు గుర్తించారు. అయితే విచారణలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియా బాధితులైన నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్‌ అని తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి చేరింది.

Jharkhand Horror 5 Thalassemia Kids Infected with HIV via Negligent Blood Transfusions

ఈ ఘటనను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ ఘటనపై రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, జిల్లా సివిల్ సర్జన్ నుంచి పూర్తిస్థాయిలో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం వెస్ట్ సింగ్‌ భూమ్ జిల్లాలో 515 హెచ్ ఐవీ పాజిటివ్ బాధితులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+