మరో శ్రద్ధ: భార్య దారుణ హత్య, 50 ముక్కలు చేశాడు, దిల్దార్ అన్సారీ అరెస్ట్

రాంచీ: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య మరువక ముందే ఇలాంటి మరిన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శ్రద్ధా వాకర్‌ను ఆమె సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి.. తర్వాత ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలోనూ తాజాగా చోటు చేసుకుంది.

మాయమాటలతో పెళ్లి.. భార్యను 50 ముక్కలుగా నరికాడు

మాయమాటలతో పెళ్లి.. భార్యను 50 ముక్కలుగా నరికాడు

జార్ఖండ్‌లోని బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌గంజ్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, 50 ముక్కలు చేసి పలు ప్రాంతాల్లో విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6:00 గంటలకు సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలోని పాత ఇంటిలో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నిందితుడు మహిళను ప్రలోభపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో హత్య కేసు వెలుగులోకి

తల్లిదండ్రుల ఫిర్యాదుతో హత్య కేసు వెలుగులోకి

రుబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త, నిందితుడు దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రూబికా.. దిల్దార్‌కు రెండో భార్య అని, దంపతులిద్దరూ గత రెండేళ్లుగా ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు ఆమె మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా రూబికా ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రుబికాను రెండో భార్యగా.. దారుణ హత్య, దిల్దార్ అన్సారీ అరెస్ట్

రుబికాను రెండో భార్యగా.. దారుణ హత్య, దిల్దార్ అన్సారీ అరెస్ట్


సాహెబ్‌గంజ్ ఎస్పీ మాట్లాడుతూ.. "సాహిబ్‌గంజ్‌లో ఆదిమ గిరిజన వర్గానికి చెందిన 22 ఏళ్ల మహిళ శరీరం 12 భాగాలు కనుగొనబడ్డాయి. శరీరంలోని కొన్ని భాగాలు ఇంకా కనిపించలేదు. వాటి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆమె భర్త దిల్దార్ అన్సారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు అతని రెండవ భార్య అని తెలిపారు.
నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును ఉపయోగించి మహిళ మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
జార్ఖండ్ సర్కారుపై బీజేపీ విమర్శలు
రాష్ట్రంలో మహిళలకు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతలు దిగజారిపోయాయని జార్ఖండ్ హేమంత్ సర్కారుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హేమంత్ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+