విషాదం:పెళ్ళి చేసుకోలేదనే అక్కసుతో నవ వధువు గొంతు కోశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఘజియాబాద్:తనను ప్రేమించలేదనే కోపంతోపాటు వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొందనే అక్కసుతో నవ వధువు గొంతుకోశాడు ఓ కిరాతకుడు.అయితే ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని సాహిబాబాద్ టౌన్ షిప్ కు చెందిన 26 ఏళ్ళ యువతికి ఈ నెల 4వ, తేదిన సోనేపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.

పెళ్ళి తర్వాత వచ్చిన తొలి హోలి పండుగను పుట్టింట్లో జరుపుకొనేందుకుగాను ఆ యువతి ఘజియాబాద్ కు వచ్చింది. అయితే ఆమెపై కోపంతో రగిలిపోతోన్న పొరుగింటి యువకుడు రాజీవ్ కశ్యప్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

Jilted lover slashes throat of newly married woman in Ghaziabad

ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసి పరారయ్యాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆ యువతి కేకలు వేసింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె చావు బతుకుల మద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కశ్యప్ తనను పెళ్ళి చేసుకోవాలని అనుకొన్నాడని, అయితే తాను వేరే వ్యక్తిని వివాహం చేసుకొన్నాననే కోపంతో తనను చంపాలనుకొన్నాడని ఆ యువతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే వారిద్దరి మద్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై వివరాలు తెలియవని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 26-year-old woman who got married earlier this month is battling for life after neighbour, a jilted lover, slashed her throat early Saturday morning in Sahibabad township of Ghaziabad.
Please Wait while comments are loading...