మోసం చేసిందని ప్రేయసిని చంపేసి ఆత్మహత్య
కాన్పూర్: మోసం చేసిందని కక్ష పెంచుకున్న ప్రియుడు ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపి తరువాత అతనూ ఆత్మహత్య చేసుకున్నసంఘటన కాన్పూర్ లో జరిగింది. మరో యువకుడితో పెళ్లికి సిద్దం అయిన ఆమె ప్రాణాలు తీసి అదే తుపాకితో అతను కాల్చేకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు సత్యకేశ్ పాశ్వాన్ (26), వందన (22) కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.
సత్యకేశ్ పాశ్వాన్ టెంపో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల వందన కుటుంబ సభ్యులు వేరే సంబంధం చూసి పెళ్లికి సిద్దం చేశారు. వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వందన అంగీకరించింది. ఈ విషయం తెలుసుకున్న సత్యకేశ్ కుమిలిపోయాడు.

తనను మోసం చేసిందని వందన మీద కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి వందన ఇంటి దగ్గరకు వెళ్లిన సత్యకేశ్ పిస్తోల్ తీసుకుని ప్రియురాలిని అతి దారుణంగా కాల్చి చంపేశాడు. తరువాత అదే గన్ తో తానూ కాల్చుకుని అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లి జరగవలసిన ఇంటిలో పెళ్లి కుమార్తె హత్యకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు కుమిలిపోయారు. సత్యకేశ్ కుటుంబ సభ్యులు సైతం విషాదంలో మునిగిపోయారు. కంట్రి మేడ్ పిస్తోల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications