మార్కెట్‌లో జియో కొత్త 4జీ మొబైల్ ఫోన్- రూ.999లకే: ఎక్కడ లభిస్తాయంటే?
ముంబై: దేశీయ టెలికమ్యూనికేషన్ సెగ్మెంట్‌లో పెను సంచలనం సృష్టించిన సంస్థ రిలయన్స్ జియో. ప్రారంభంలో ఫ్రీగా సిమ్, టాక్ టైమ్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిందీ కంపెనీ. చవగ్గా మొబైల్ హ్యాండ్‌సెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 500 రూపాయలకే అప్పట్లో మొబైల్ ఫోన్ విక్రయాలను చేపట్టింది. మధ్యలో మొబైల్ హ్యాండ్‌సెట్ల విక్రయాలను నిలిపివేసింది రిలయన్స్ జియో.
ఇప్పుడు మళ్లీ వాటి విక్రయాలను ఆరంభించింది. కొత్తగా భారత్ జియో పేరుతో మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ఇవ్వాళ లాంచ్ చేసింది. బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది. 4జీ ఇంటర్‌నెట్ సపోర్ట్ చేసే ఫోన్ ఇది. ధర 999 రూపాయలు మాత్రమే. సాధారణంగా స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని దీనికీ కల్పించింది.

దేశంలో ఇప్పటికీ 2జీ డేటా ఇంటర్‌నెట్‌ను వినియోగించే వారు 250 మిలియన్ల మంది ఉన్నారని, వారందరినీ 4జీలోకి కన్వర్ట్ చేయడంలో భాగంగా అతి తక్కువ ధరలో అంటే 999 రూపాయలకే ఇంటర్‌నెట్ ఆధారిత మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రిలయన్స్ జియో యాజమాన్యం తెలిపింది.
ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి మరో సౌకర్యం ఉంది. 123 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌కే 28 రోజుల అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తోంది కంపెనీ. ఈ 28 రోజులకు ఏకంగా 14 జీబీల డేటాను వినియోగించుకోవచ్చు. ఇదే ప్లాన్ కింద ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే 28 అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ 2జీబీ డేటా ప్లాన్ ధర 179 రూపాయలు ఉంటోంది.
ఆ మొత్తం కంటే తక్కువకే అంటే 123 రూపాయలకే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 14 జీబీల డేటాను అందిస్తోన్నామని రిలయన్స్ జియో తెలిపింది. ఇతర సర్వీస్ ప్రొవైడర్ల కంటే 30 శాతం తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్, ఏడు రెట్లు ఎక్కువ ఇంటర్‌నెట్ వినియోగ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది.

సంవత్సరం మొత్తానికీ ఒకేసారీ రీఛార్జ్ చేసుకోవాలంటే 1,234 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. 168 జీబీల డేటాను వినియోగించుకోవచ్చు. అంటే రోజుకు 0.5 జీబీ డేటా సౌకర్యం ఉంటుంది ఇందులో. ఇది కూడా ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో కంపేర్ చేసి చూస్తే ప్లాన్ ధరలో 25 శాతం తక్కువే. ఫీచర్ ఫోన్లకు అందించే సంవత్సరం వాలిడిటీ ఉండే బేసిక్ రీఛార్జ్ ప్లాన్‌పై 1,799 రూపాయలు వసూలు చేస్తోన్నాయి ఇతర కంపెనీలు.
ఈ నెల 7వ తేదీ నుంచి అమ్మకాలను మొదలు పెట్టబోతోంది జియో. ఒకేసారి 10 లక్షల ఫోన్లను మార్కెట్‌లోకి గుమ్మరించబోతోంది. దేశవ్యాప్తంగా 6,500 మండలాల్లో వాటి అమ్మకాలను ఆరంభించనుంది. గ్రామస్థాయికి 4జీ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే జియో భారత్ పేరుతో హ్యాండ్ సెట్‌ను విడుదల చేసినట్లు జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.
4.5 సెంటీమీటర్ల టీఎఫ్‌టీ స్క్రీన్, 0.3 ఎంపీ కెమెరా, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, లౌడ్ స్పీకర్, టార్చ్, 128 జీబీల వరకు సేవ్ చేసుకోదగ్గ కెపాసిటీ ఉండే ఎస్డీ కార్డ్‌ను ఇందులో ఇన్‌సర్ట్ చేసుకోవచ్చు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ దీనికి అటాచ్ అయి ఉంటుంది. దీనితో మొబైల్ సెగ్మెంట్‌లో మరో పోటీ ఏర్పడినట్టయింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications