Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jio book: చవగ్గా ల్యాప్‌టాప్: అద్దిరిపోయే ఫీచర్లు: మార్కెట్‌లో రిలీజ్

ముంబై: దేశీయ టెలికమ్యూనికేషన్ సెగ్మెంట్‌లో పెను సంచలనం సృష్టించిన సంస్థ రిలయన్స్ జియో. ప్రారంభంలో ఫ్రీగా సిమ్‌, టాక్ టైమ్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిందీ కంపెనీ. చవగ్గా మొబైల్ హ్యాండ్‌సెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 500 రూపాయలకే అప్పట్లో మొబైల్ ఫోన్ విక్రయాలను చేపట్టింది. మధ్యలో మొబైల్ హ్యాండ్‌సెట్ల విక్రయాలను నిలిపివేసింది రిలయన్స్ జియో.

కొద్దిరోజుల కిందటే మళ్లీ వాటి విక్రయాలను ఆరంభించింది. కొత్తగా భారత్ జియో పేరుతో మొబైల్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 4జీ ఇంటర్‌నెట్ సపోర్ట్ చేసే ఫోన్‌ను 999 రూపాయలకు విక్రయిస్తోందా కంపెనీ యాజమాన్యం. స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని దీనికీ కల్పించింది.

 Jio launched JioBook, check here for the price, features and other details

ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది రిలయన్స్ జియో. కొత్తగా ల్యాప్ టాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొద్దిసేపటి కిందటే వాటిని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. జియో బుక్‌గా దీనికి పేరు పెట్టింది. ఈ జియో బుక్ ల్యాప్ టాప్స్ అమ్మకాలను ప్రారంభించినట్లు రిలయన్స్ యాజమాన్యం ప్రకటించింది.

జియో బుక్ ల్యాప్ టాప్ ధర 16,499 రూపాయలు. ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. జీయో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది ఈ బుక్. దీని బరువు 990 గ్రాములు. జియో 4జీ ఎల్టీఈ సిమ్‌‌ను ఇందులో ఇన్‌సర్ట్ చేయవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై‌తో కనెక్ట్ అవుతుందీ ల్యాప్ టాప్.

ఈ ల్యాప్ ట్యాప్ స్పీడ్ 4జీబీ ర్యామ్. 64 జీబీ ఫ్లాష్ మెమొరీని కలిగివుంటుంది. 256 జీబీ వరకు దీని మెమొరీని ఎక్స్‌పాండ్ చేయవచ్చు. ల్యాప్ ట్యాప్ సైజ్ 11.6 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లేతో అదరగొట్టే లుక్స్‌తో కనిపిస్తోంది జియో బుక్. ఇవ్వాళ్టి నుంచి దీని అమ్మకాలు మొదలయ్యాయని రిలయన్స్ జియో తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+