రిలయన్స్ ఫీచర్‌‌ఫోన్: స్మార్ట్‌ఫోన్‌‌తో పోటీ, టిక్కెట్ల బుకింగ్ కోసం ప్రత్యేక యాప్

ముంబై: స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ పనిచేయనుంది. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ ఫీచర్ ఫోన్లను తయారు చేయడానికి సిద్దమౌతున్నాయి. ఫీచర్ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడమే సంచలనం. ఉచిత వాయిస్ కాల్స్, డేటా కాల్స్‌తో ప్రత్యర్థి కంపెనీలకు రిలయన్స్ జియో చుక్కలు చూపించింది. రిలయన్స్ జియో అనుసరించిన బాటలోనే ఇతర కంపెనీలు కూడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

రిలయన్స్ జియో సరికొత్తగా ఫీచర్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.అయితే మూడేళ్ళ తర్వాత ఈ ఫోన్ల కోసం చెల్లించిన రూ.1500 తిరిగి చెల్లించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

రిలయన్స్ జియో చూపిన మార్గంలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చిప్ తయారీ కంపెనీలకు గిరాకి ఏర్పడింది.స్మార్ట్‌ఫోన్ల తరహలోనే జియో ఫీచర్ పోన్లను డెవలప్ చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్లకు ధీటుగా ఫీచర్ పోన్లు

స్మార్ట్‌ఫోన్లకు ధీటుగా ఫీచర్ పోన్లు

స్మార్ట్ ఫోన్లకు ధీటుగా రిలయన్స్ జియో ఫీచర్ పోన్లను అభివృద్ది చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు, ఈవెంట్ టికెటింగ్, ఫ్లాట్‌ఫామ్, బుక్ మై షో కోసం జియో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ది చేస్తోంది.జియో ఫీచర్ ఫోన్లు స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసిపోవని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జియో వినియోగదారుల తరహలోనే ఫీచర్ ఫోన్లకు గిరాకీ పెరిగే అవకాశం లేకపోలేదు.అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ భారత్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని 4జీ ఫీచర్ ఫోన్ల కోసం చిప్‌లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆన్‌లైన్ మూవీ, ఈవెంట్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్‌మై షో జియో ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.

చిప్ కంపెనీలతో చర్చిస్తున్న టెలికం కంపెనీలు

చిప్ కంపెనీలతో చర్చిస్తున్న టెలికం కంపెనీలు

జియో 4జీ ఫీచర్ ఫోన్ పుణ్యమా అని దేశంలో ఫీచర్ ఫోన్లకు మళ్లీ ప్రాణం లేచి వస్తోంది. చాలా చిప్ కంపెనీలు దేశంలోని ఫీచర్ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి. చైనా సెమీ కండక్టర్ కంపెనీ స్ర్పెడ్‌ట్రమ్ భారత్‌లోని మొబైల్ మేకర్స్‌తోపాటు, భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న చైనా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 4జీ ఫీచర్ ఫోన్ల కోసం తాము చిప్‌లు సరఫరా చేస్తామంటూ ఒప్పందానికి ముందుకొచ్చింది.

ఫీచర్ ఫోన్లపై పెట్టుబడులు

ఫీచర్ ఫోన్లపై పెట్టుబడులు


చిప్‌మేకర్లు, హ్యాండ్‌సెట్ మేకర్ల నుంచి యాప్ డెవలపర్ల వరకు ఇప్పుడు ఫీచర్ ఫోన్లపై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా కంపెనీలన్నీ ఫీచర్ ఫోన్లను వదిలి స్మార్ట్‌ఫోన్లపై పడ్డాయి.బంపర్ ఆఫర్లతో ముందుకు వచ్చిన జియోను వినియోగం దేశంలో అమాంతం పెరిగిపోయింది. ఫీచర్‌ఫోన్ కూడ ఇదే రకంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

రూ.2500లకు 4 జీ ఫీచర్ ఫోన్‌కు ప్లాన్

రూ.2500లకు 4 జీ ఫీచర్ ఫోన్‌కు ప్లాన్

ఒక్కసారిగా ఫీచర్ ఫోన్ల హవా పెరగడంతో మొబైల్ మేకర్లందరూ వీటిపై పడ్డారు. చైనా ఫోన్ మేకర్ ఐటెల్, దేశీయ కంపెనీలు లావా, ఇంటెక్స్‌లు బండిల్ ఆఫర్ల కోసం వొడాఫోన్ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. 2జీ ఫీచర్ ఫోన్లతో వాయిస్ కాల్ ప్లాన్స్, క్యాష్‌ బ్యాక్ ఆఫర్లకు ప్లాన్ చేస్తున్నాయి. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్.. లావా, కార్బన్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. రూ.2500తో 4జీ ఫీచర్ ఫోన్‌ను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది ఈ దీపావళికే బండిల్ ఆఫర్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+