ఆరెస్సెస్ పిలుపు: రిజర్వేషన్ వదులుకున్న మాంఝీ
పాట్నా: తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిజర్వేషన్‌లను ఉపయోగించుకోనని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానా అవామీ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షులు జితన్ రామ్ మాంఝీ సోమవారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను లేదా తన కుటుంబ సభ్యులు రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయరని చెప్పారు.
జనరల్ స్థానం నుంచే పోటీ చేస్తామన్నారు. తమ సామాజిక వర్గంలో బలహీనులు ఎవరో వారే రిజర్వేషన్ పొందేందుకు అర్హులు అనే ఉద్దేశంతో రిజర్వేషన్ వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇకపై తాము దళిత కార్డుపై ఎన్నికల్లో పోటీ చేయమన్నారు.

బలహీన వర్గాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత ఇచ్చిన పిలుపు నేపథ్యంలో, మాంఝీ రిజర్వేషన్ వదులుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. మాంఝీ బీజేపీతో జతకట్టి గత ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications