కాశ్మీరీ పండిట్లకు టౌన్‌షిప్‌లు: వేర్పాటువాదుల బంద్(ఫొటోలు)
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జెకెఎల్ఎఫ్ వేర్పాటువాదులు బంద్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్ నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేర్పాటువాదులంతా ఆందోళనకు దిగారు.
ఆందోళనలో భాగంగా శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు, పెట్రోలు బంకులు మూసివేయించారు. ప్రభుత్వాధికారులు కార్యాలయాలకు చేరుకోకుండా అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతా దళాలు భారీగా మోహరించి కాపలా కాస్తున్నాయి.

కాల్పులు: ముగ్గురు బిఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు
పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు బిఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని అట్టారి-వాఘా ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బిఎస్ఎఫ్ జవాన్లపై దుండగులు కాల్పులు జరపడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

కాగా, సరిహద్దు వద్ద స్మగ్లర్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు వెల్లడించారు. 11 రౌండ్లు కాల్పులు జరిగాయని, కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారని తెలిపారు. సరిహద్దు అవతలి నుంచి కాల్పులు జరిగనట్లు పేర్కొన్నారు. పంజాబ్ బిఎస్ఎఫ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications