Jharkhand Elections: జార్ఖండ్ లో ఎవరి బలం ఎంత - గెలుపెవరిది..!!
జార్ఖండ్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రెండు ప్రధాన కూటములు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జమ్ము కాశ్మీర్, హర్యానా ఫలితాల తరువాత బీజేపీ కొత్త జోష్ తో కనిపిస్తోంది. కానీ, ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న సానుకూలత ఇక్కడ బీజేపీకి కనిపించటం లేదు. జేఎంఎం నాయకత్వంలో ఇండియా కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండు కూటముల బలాలు, బలహీనతలు ఇప్పుడు గెలుపును డిసైడ్ చేయనున్నాయి. దీంతో, పోరు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
ఎన్నికల సమరం
జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ కూటమి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోంది. 2019 లో అధికారం కోల్పోయిన ఎన్డీఏ ఈ సారి తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అదే సమయంలో జేఎంఎం నాయకత్వంలోని ఇండియా కూటమి సైతం మరోసారి గెలుపు కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. బీజేప ప్రధానంగా జార్ఖండ్ లో అవినీతిని ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటుగా బంగ్లాదేశీల చొరబాటు అంశాన్ని తమ ప్రచారంలో కీలకంగా ప్రస్తావన చేస్తోంది. అటు అభ్యర్ధుల ఖరారులో ఇతర పార్టీల కంటే బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. త్వరలోనే తొలి జాబితా ప్రకటనకు కసరత్తు ముమ్మరం చేసింది.

కొత్త వ్యూహాలతో
జార్ఖండ్ పైన ఆశలు పెంచుకున్న బీజేపీ నాయకత్వం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కు పది స్థానాలు వరకు కేటాయించనుంది. అదే విధంగా.. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు రెండు సీట్లను బీజేపీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తులు కొంత మేర బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో విఫలమైన లా అండ్ ఆర్డర్ అంశాన్ని బీజేపీ అనుకూలంగా మలచుకుంటోంది. చంపయీ సోరెన్ చేరికతో గిరిజనుల బలం ఉన్న ప్రాంతాల్లో బలం పెరగనుంది. శిబూ సోరెన్ కోడలు సీతా సోరెన్ పార్టీలోకి రావడం తో పాటుగా గిరిజన నేత అర్జున్ ముండా పార్టీకి నాయకత్వం బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
గెలుపు దక్కేదెవరికి
అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమనే అభిప్రాయం బలంగా ఉంది. మొత్తం 81 స్థానాలు ఉండగా..అందులో 28 ఎస్టీలకు రిజర్వు కావడంతో పాటుగా అక్కడ జేఎంఎం బలంగా ఉండటం కూడా బీజేపీకి నష్టం చేసేదిగా ఉంది. అటు ఇండియా కూటమి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హేమంత్ ఇప్పుడు కూటమి బలంగా కనిపిస్తున్నారు. సర్నా వర్గం మద్దతు తమకే దక్కుతుందని భావిస్తోంది. ఇండియా కూటమి నేతలు బీజేపీలో చేరటం ఎన్నికల సమయంలో డామేజ్ చేసే అంశంగా మారింది. దీంతో..రెండు కూటములు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావటంతో.. అమలు చేస్తున్న కొత్త వ్యూహాలతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications