వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు కాలేజీలో జ్ఞాన దర్శన్ పుస్తక ఎగ్జిబిషన్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: 'నేను నిధుల కోసం చూడలేదు. నేను లైబ్రరీకి వెళ్లిన ప్రతిసారి అక్కడ వాటిని గుర్తించాను' - మైఖల్ ఎంబ్రీ.

కర్నాటక రాజధాని బెంగళూరులో'జ్ఞాన దర్శన్' పేరిట బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జ్ఞాన దర్శన్ బుక్ ఎగ్జిబిషన్ 2016-17 బ్యానర్‌లో పైన మైఖల్ ఎంబ్రీ చెప్పిన సూక్తి ఉంది. ఈ బుక్ ఎగ్జిబిషన్ క్రీస్తు జయంతి కాలేజీ ఆర్గనైజ్ చేస్తోంది.

Jnana Darshan book exhibition at Kristu Jayanti College, Bangalore

కాలేజీ అధ్యాపకులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి బుక్ ఎగ్జిబిషన్‌లను కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇలాంటి బుక్ ఎగ్జిబిషన్‌లను కాలేజీ విద్యార్థులు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు.

క్రీస్తు జ్యోతి జయంతి ప్రిన్సిపల్ రేవ. జోస్ కుట్టీ ఈ బుక్ లైబ్రరీలో తొలి స్పీకర్. అతను మాట్లాడుతూ... నేటి యువత మేథస్సుకు ఉపయోగపడతాయి. ప్రిన్సిపల్ రేవ. జోస్ కుట్టి ఏం చెబుతారంటే.. పుస్తకాలు చదవాలని చెబుతారు. అవి మనకు సరైన దారిని చూపిస్తాయని అంటారు.

అదేవిధంగా మనకు మంచి భవిష్యత్తును ఇస్తాయని చెబుతారు. విద్యార్థులు తమ జీవితన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. మంచి పుస్తకాలను చదవాలన్నారు.

పుస్తకలు అమ్మే పబ్లిషర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వయసుతో నిమిత్తం లేకుండా అందరిలోను విజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. అదేసమయంలో పుస్తకాల అమ్మకం కేవలం వ్యాపారమే కాదని, ఇది అన్నింటి కంటే విభన్నమైనది అని చెప్పారు.

ఈ కార్యక్రమానికి వన్ ఇండియా (కన్నడ) ఎస్కే శామ సుందర చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అతను తన ప్రసంగం ద్వారా విద్యార్థులకు మంచి విషయాలు చెప్పారు. శామ సుందర చదవడం యొక్క ప్రాధాన్యతను వివరించారు. అందుకు జేమ్స్ బోస్‌వెల్‌ను ఉదహరించారు.

శామ సుందర మాట్లాడుతూ.. తనను ఈ బుక్ ఫెయిర్‌కు పిలిచారని, డిజిటల్ ఎడిటర్‌ను పిలవడం సంతోషకరమని అన్నారు. ఒకప్పుడు తాను పుస్తకాల పురుగును అని, బాగా చదివే వాడిని అని, ఇప్పుడు పుస్తకాలు చదవడం ఆపేశానని చెప్పారు.

Jnana Darshan book exhibition at Kristu Jayanti College, Bangalore

ఇప్పుడు నేను వెబ్‌కు రాస్తున్నానని, ఇప్పుడు తాను నిత్యం న్యూస్ బ్రౌజింగులో మునిగిపోయనని చెప్పారు. ఇప్పుడు నేను రాయాలనుకుంటే, ఫేస్‌బుక్‌లో ఆటోబయోగ్రఫీ రాస్తానని లేదా ట్విట్టర్లో రాస్తానని చెప్పారు.

క్రీస్తు జయంతి కాలేజీ గురించి..

క్రీస్తు జయంతి కాలేజీ 1999లో వచ్చింది. దీనిని బోధి నికేతన్ ట్రస్ట్ నడుపుతోంది. బోధి నికేతన్ ట్రస్ట్‌ను సెయింట్ జోసెఫ్ ప్రావిన్స్ ఆఫ్ ది కార్మెలైట్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (సీఎంఐ) సభ్యులు ఫాం చేశారు.

Jnana Darshan book exhibition at Kristu Jayanti College, Bangalore

క్రీస్తు జయంతి కాలేజీ బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. నాక్ ద్వారా గ్రేడ్ ఏ పొందిన కాలేజీ. ఈ కాలేజీ.. 2013లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక, బెంగళూరు యూనివర్సిటీల నుంచి స్వయం ప్రతిపత్తి హోదా పొందింది.

'నేను నిధుల కోసం చూడలేదు. నేను లైబ్రరీకి వెళ్లిన ప్రతిసారి అక్కడ వాటిని గుర్తించాను' - మైఖల్ ఎంబ్రీ.

English summary
"I don't have to look far to find treasures, I discover them every time I visit a library" - Michael Embry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X