వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ విద్యార్ధిని పట్ల ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ విద్యార్ధినిపై ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెంది ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతరం ఆమెపై తనకున్న లైంగిక వాంఛను తీర్చుకోవాలని చూశాడు.

వివరాల్లోకి వెళితే జేఎన్‌యూలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధిని రీసెర్చ్ స్కాలర్‌గా చేరింది. గతవారంలో బంగ్లాదేశ్ విద్యార్ధినిని ఒకరోజు తన ఇంట్లో పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆ విద్యార్ధిని ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

విద్యార్థిని ఫిర్యాదుతో యూనివర్సిటీ అధికారులు జరిపిన విచారణలో సదరు ప్రొఫెసర్‌పై వచ్చిన లైంగి ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో సదరు ఫ్రొఫెసర్‌పై చర్యలకు విచారణ కమిటీ సిఫారసు చేసింది. దీంతో మంగళవారం ఉదయం విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన యూనివర్సిటీ కార్యవర్గ మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) ఆ ఫ్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించింది.

JNU professor sacked for sexual abuse of scholar

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసంలో లైంగిక వేధింపులకు ఎదుర్కొంటున్న సంస్ధల్లో జేఎన్‌యూ మొదటి స్థానంలో నిలిచింది.

గతవారం లోక్‌సభకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సమర్పించిన నివేదకలో 2013-14 సంవత్సరానికి గాను జేఎన్‌యూలో 25 లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు.

English summary
The services of a faculty member of Jawaharlal Nehru University were terminated on Monday after an inquiry committee found him guilty in a case of alleged sexual harassment filed by a foreign scholar. The complainant was pursuing research under him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X