‘అఫ్జల్ గురు అమరవీరుడైతే.. హనుమంతప్ప ఎవరు?’
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్యార్థులు నిరసన తెలపడంపై ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాది అఫ్జల్ గురు అమరవీరుడైతే.. దేశం కోసం ప్రాణాలు వదిలిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఎవరు?' అని యోగేశ్వర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యోగేశ్వర్.. దేశభక్తిపై ట్విట్టర్‌లో ఓ పద్యం రాశారు.
किन लोगों के लिए सेना के जवान जान की बाज़ी लगा रहे हैं और किन लोगों के गर्व के लिए खिलाड़ी दिन रात पसीना बहा रहे हैं pic.twitter.com/hMqKNdjxkE
— Yogeshwar Dutt (@DuttYogi) February 13, 2016
పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు మక్బుల్ భట్‌ల ఉరికి నిరసనగా ఫిబ్రవరి 9న పలువురు విద్యార్థులు జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు.
దేశద్రోహం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఇతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.












Click it and Unblock the Notifications