వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పట్లో బాగా సంపాదించా: అమిత్ షా, ‘రాహుల్‌కు ఆ పని ఎప్పటికీ చేయను’

‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చవిచూసింది కదా... దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మిమ్మల్నిగానీ సలహా ఇమ్మంటే ఏం చెబుతారు?’ అని. అయితే.. అమిత్ షా వెంటనే తడుముకోకుండా సమాధానం

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతీయ జనతా పార్టీ వరుస విజయాలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనే వ్యూహాలు బీజేపీని ముందుకు నడిపిస్తున్నాయి. కాగా, ఓ మీడియా ప్రతినిధి అడిగిన అమిత్ షాను ఆసక్తికర ప్రశ్న అడిగారు.

మీరేం చెబుతారా?..

మీరేం చెబుతారా?..

అదేమంటే.. ‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చవిచూసింది కదా... దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మిమ్మల్నిగానీ సలహా ఇమ్మంటే ఏం చెబుతారు?' అని. అయితే.. అమిత్ షా వెంటనే తడుముకోకుండా సమాధానం చెప్పేశారు.

ఎప్పటికీ చేయను..

ఎప్పటికీ చేయను..

‘ఆ ఒక్క పని మాత్రం ఎప్పటికీ చేయను' అని అమిత్ షా కుండబద్దలు కొట్టేశారు.
ముంబైలో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో వీడియో లింక్ ద్వారా ఆయన మాట్లాడారు.

ఒకరి వైఫల్యం మీద ఆధారపడం..

ఒకరి వైఫల్యం మీద ఆధారపడం..

‘కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ నడిపిస్తున్నంత కాలం ప్రధాని మోడీకి, మీకు భయపడాల్సిన అవసరమే లేదనుకుంటా?' అని అడిగితే.. ‘శత్రువుల బలహీనతపై ఆధారపడి మేం పనిచేయం' అని అమిత్ షా స్పష్టం చేశారు.

అప్పట్లో బాగా సంపాదించా..

అప్పట్లో బాగా సంపాదించా..

తొలి రోజుల్లో స్టాక్ మార్కెట్ బ్రోకర్‌గా పనిచేసిన విషయంపై మీడియ ప్రతినిధులు ప్రశ్నించగా ... అప్పట్లో తాను బాగానే సంపాదించానని వెల్లడించారు. ప్రధాని మోడీతో ఆయన సంబంధాల గురించి అడగ్గా... ‘ప్రధానమంత్రికి, అధికార పార్టీ అధ్యక్షుడి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలో... అదే సంబంధం మా మధ్య ఉంది' అని అమిత్ షా తెలిపారు.

English summary
Taking a dig at Rahul Gandhi, Bharatiya Janata Party president Amit Shah on Friday said he would not like to take up the job of advising the Congress vice president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X