ఆ సీన్ చూసి పోలీసులే షాక్ తిన్నారు... భార్యను హత్య చేసి.. శవం పక్కనే ఇలా కూల్‌గా...
రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా హత్య చేసిన ఓ భర్త... ఆ తర్వాత కూల్‌గా ఆమె శవం పక్కనే కూర్చొని సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు,మృతురాలి కుటుంబ సభ్యులు ఆ సీన్ చూసి షాక్ తిన్నారు. జోధ్‌పూర్‌లోని బీజేఎస్ కాలనీలో జరిగిన ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది...
జోధ్‌పూర్‌లోని బీజేఎస్ కాలనీలో విక్రమ్ సింగ్-శివ కన్వర్ దంపతులు చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి పిల్లలు. విక్రమ్ సింగ్ చాలా కాలంగా ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటున్నాడు. అతని భార్య శివ కన్వర్ ఓ కోపరేటివ్ స్టోర్‌లో కుట్టు పని చేస్తోంది. అయితే భార్య పని చేయడం ఇష్టం లేని విక్రమ్ సింగ్ కొంతకాలంగా ఆమెతో తరుచూ గొడవ పడుతున్నాడు. అయితే ఆమె సంపాదనతోనే ఇల్లు గడుస్తుండటంతో ఆమె పని మానేయలేదు.

ఆ సీన్ చూసి షాక్...
ఇదే క్రమంలో ఆదివారం(డిసెంబర్ 6) రాత్రి కూడా విక్రమ్ కుమార్ భార్య శివ కన్వర్‌తో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో కత్తెరతో ఆమె కడుపులో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు,ఆమె కుటుంబ సభ్యులకు అతనే స్వయంగా ఫోన్ చేసి హత్య విషయం చెప్పాడు. ఆపై తీరిగ్గా భార్య శవం పక్కన కూర్చొని మొబైల్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు,ఆమె కుటుంబ సభ్యులు ఆ సీన్ చూసి షాక్ తిన్నారు.

ఫ్రస్టేషన్‌లో...?
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... విక్రమ్‌కు ఉద్యోగం లేని కారణంగా కొంతకాలం నుంచి తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. శివ కన్వర్ మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. విక్రమ్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు విక్రమ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications